calender_icon.png 9 January, 2025 | 7:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులను పరామర్శించిన మంత్రులు

05-11-2024 04:01:01 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): అస్వస్థతకు గురైన గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులను మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ పరామర్శించారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన పాఠశాలలో విద్యార్థులు ఫుడ్ పాయిజన్ తో అనారోగ్యానికి గురై నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ కలిసి నిమ్స్ డైరెక్టర్ బీరప్పను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులకు మంచి వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించారు. ప్రస్తుతం విద్యార్థినుల ఆరోగ్యం పరిస్థితి నిలకడగా ఉందని, ధైర్యంగా ఉండాలని తల్లిదండ్రులకు తెలిపారు.