calender_icon.png 30 April, 2025 | 12:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు జిల్లాలో మంత్రి పర్యటన

30-04-2025 12:00:00 AM

మోడల్ ఇందిరమ్మ ఇంటిని ప్రారంభోత్సవం, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

వనపర్తి టౌన్ ఏప్రిల్ 29:  మంగళవారం రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వనపర్తి జిల్లా పర్యటనను విజయవంతం చేసేందుకు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు.మంగళవారం ఉదయం మంత్రి  వనపర్తి జిల్లాలో పాల్గొననున్న కార్యక్రమం ప్రదే శాలను,హెలిపాడ్ ను కలెక్టర్  సందర్శించారు.

అనంతరం కలెక్టర్ తన ఛాంబర్ లో  అధికారులతో మాట్లాడి దిశానిర్దేశం చేశారు.మంత్రి పర్యటన సందర్భంగా వనపర్తి  ప్రభుత్వ మెడికల్ కళాశాలలో నూతనంగా నిర్మించిన పి.జి విద్యార్థుల వసతి భవనం,అధ్యాపకుల భవనం ప్రారంభోత్సవం చేయనున్నారు. మండల అభివృద్ధి కార్యాలయ సముదాయంలో ఏర్పాటు చేసిన మో డల్ ఇందిరమ్మ ఇంటిని ప్రారంభోత్సవం చేస్తారు.అక్కడే రేవల్లి, శ్రీరంగాపూర్,ఎదుల తహసిల్దార్ కార్యాలయాలకు శంఖుస్థాపన చేయనున్నారు.

కె.డి.ఆర్ పాలిటెక్నిక్ కళాశాల వెనక భా గంలో ఆధునీకరించిన బి.సి. బాలుర కళాశాఖ వసతి గృహం, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ చెరువు సుందరీకరణ ప్రారంభోత్సవం చేస్తారు.అనంతరం కల్యాణసాయి గార్డెన్ ఫంక్షన్ హాల్లో రైతులకు భూ భారతి చట్టం పై అవగాహన ఆదస్సు, మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.

ఇట్టి కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు  సంబంధిత అధికారులు బాధ్యతలు తీసుకోవాలని బాధ్యతలు అప్పగించారు.అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ ఇన్చార్జి యాదయ్య, రోడ్లు భవనాలు కార్యనిర్వహక ఇంజనీర్ దేశ్య నాయక్, ఆర్డీఓ సుబ్రమణ్యం, స్థానిక తహసీల్దార్ రమేష్ రెడ్డి, జిల్లా బి.సి. సంక్షేమ శాఖ అధికారి ఇందిరా, పి.డి. హౌసింగ్ పర్వతాలు తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.