మహాదేవపూర్ (విజయకాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్న రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మాత్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మాత్యులు దామోదర రాజనర్సింహ పాల్గొని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తారని భూపాల్ పల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు శుక్రవారం తెలిపారు. మంత్రులు గణపురం మండలం బుద్ధారం నుండి కొడవటంచ వరకు మూడు కిలోమీటర్ల రహదారి, ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మించుటకు 50 కోట్లతో పనులు ప్రారంభిస్తారు. భూపాలపల్లిలోని 50 పడకలతో ఆయుష్ ఆస్పత్రికి 15 కోట్లతో శంకుస్థాపన చేస్తారు. నూతన మెడికల్ కాలేజీ భవన నిర్మాణం కొరకు 130 కోట్లతో పనులను ప్రారంభిస్తారు. ప్రభుత్వ 100 బెడ్స్ హాస్పిటల్ లో ఏడు కోట్లతో నాలుగవ అంతస్తు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. మొగుళ్లపల్లి మండలానికి చెందిన నూతన అంబులెన్స్ ను ప్రారంభిస్తారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లతో రివ్యూ నిర్వహిస్తారు. అనంతరం భూపాల్ పల్లి మున్సిపాలిటీ పరిధిలో నాలుగు కోట్లతో బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం అంబేద్కర్ సెంటర్లో ప్రజల మీటింగ్లో పాల్గొంటారని భూపాల్ పల్లి ఎమ్మెల్యే సత్యనారాయణ రావు తెలిపారు.