calender_icon.png 27 November, 2024 | 1:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేపటి నుంచి ‘గాంధీభవన్‌కు మంత్రులు’

24-09-2024 02:38:47 AM

కాంగ్రెస్‌లో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్‌గౌడ్ మార్క్  

హైదరాబాద్, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): కాంగ్రెస్‌లో పీసీసీ నూతన అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్ మార్క్ వచ్చే బుధవారం నుంచి అమలు కానుంది. ఇప్పటికే జిల్లాల వారీగా సమీక్షలు మొదలు పెట్టిన పీసీసీ చీఫ్.. మంత్రులు కూడా గాంధీభవన్‌కు వచ్చేలా కార్యాచరణ సిద్ధం చేశారు. పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయం అవసరమని, అందుకు సీఎం నెలకోసారి,  వారానికి ఇద్దరు మంత్రు లు గాంధీభవన్‌కు రావాలని పీసీసీ చీఫ్ ప్రతిపాదించగా, సీఎం రేవంత్‌రెడ్డి అంగీకారం తెలిపారు.

దీంతో ప్రతి బుధవారం, శుక్రవారాల్లో ఒక్కో మంత్రి వచ్చేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. సీఎం గాంధీభవన్‌కు వచ్చే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అయితే గత శుక్రవారం నుంచే మంత్రులు గాంధీభవన్‌కు వచ్చే ప్రతిపాదనను అ మలు చేయాలనుకున్నప్పటికీ.. క్యాబినెట్ సమావేశంతో వాయిదా పడింది . పీసీసీ చీ ఫ్ చేసిన ప్రతిపాదనలో భాగంగా వచ్చే బుధవారం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ గాంధీభవన్‌కు రానున్నారు.

ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పార్టీ కార్యకర్తలు, ప్రజలకు అందుబాటులో ఉంటారు. ఇకపై ప్రతీ బుధ, శుక్రవారాల్లో ఇదే సమయంలో మంత్రులు అందుబాటులో ఉండనున్నారు. పార్టీ శ్రేణులు, ప్రజలతో ముఖాముఖిలతో గ్రామ స్థాయిలో పార్టీ పరిస్థితి ఎలా ఉందనే అంశాలు తెలుస్తాయని భావిస్తున్నారు. 

మంత్రుల షెడ్యూల్ ఇదే.. 

సెప్టెంబర్ 25 - దామోదర రాజనర్సింహ

సెప్టెంబర్ 27 - దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

అక్టోబర్ 2 - గాంధీ జయంతి

(ఎవరూ లేరు)

అక్టోబర్ 4 - ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

అక్టోబర్ 9 - పొన్నం ప్రభాకర్

అక్టోబర్ 11 - డీ సీతక్క

అక్టోబర్ 16 - కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

అక్టోబర్ 18 - కొండ సురేఖ

అక్టోబర్ 23 పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

అక్టోబర్ 25 - జూపల్లి కృష్ణారావు

అక్టోబర్ 30 తుమ్మల నాగేశ్వరరావు