calender_icon.png 1 April, 2025 | 6:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

40 ఏళ్ల చరిత్రలో నేడు టార్గెట్ ను ఛేదించిన ఇల్లందు వ్యవసాయ మార్కెట్ పాలకవర్గం..

29-03-2025 07:43:04 PM

ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏసీ గోడౌన్ ఏర్పాటు మంత్రివర్యులు తుమ్మల హామీ..

రూ.3 కోట్ల ఆదాయాన్ని పెంచిన ఇల్లందు వ్యవసాయ మార్కెట్ కమిటీ..

విలేకరుల సమావేశంలో ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య..

ఇల్లందు టౌన్ (విజయక్రాంతి): 40 ఏళ్ల చరిత్రలో ఇల్లందు వ్యవసాయ మార్కెట్ పాలకవర్గానికి ఇచ్చిన టార్గెట్ రూ.4.64 కోట్లు కాగా నేడు 2024-25 ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ 5.14కోట్ల పైచిలుకు టార్గెట్ ను చేదించామని ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య అన్నారు. శనివారం ఇల్లందు వ్యవసాయమార్కెట్ కమిటీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బానోతు రాంబాబులు మాట్లాడుతూ.. 2024 -2025 ఆర్థిక సంవత్సరం పూర్తి అవుతున్న దృష్ట్యా ఇల్లందు వ్యవసాయ మార్కెట్ కమిటీ లాభనష్టాలను రైతు సంక్షేమాన్ని ప్రజల ముందు ఉంచాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు ఏర్పాటు చేశామన్నారు. 

ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా టేకులపల్లి మండలంలో మిర్చి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగిందని, 311 మంది రైతులు సుమారు 1100 వందల క్వింటాళ్ల మిర్చి క్రయవిక్రయాల ద్వారా రూ కోటి టర్నోవర్ జరిగిందన్నారు. సీసీఐ నందు 1629 మంది రైతులు 43, 293,45 క్వింటాళ్ల ప్రత్తిని రైతులు అమ్ముకున్నారని తెలిపారు. చెక్పోస్టులలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని నిరంతరం పర్యవేక్షణ  ద్వారా ఇల్లందు మార్కెట్ యార్డ్ నందు కొనుగోళ్లు చేయుటకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. రూ 10 కోట్ల ఆదాయం కలిగిన ఇల్లెందు వ్యవసాయ మార్కెట్ టేకులపల్లి మార్కెట్ యార్డ్ కి రూ.2 కోట్లు ఇవ్వాల్సి వచ్చిందని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇల్లందు వ్యవసాయ మార్కెట్ కు వచ్చిన పూర్తి ఆదాయాన్ని ఇక్కడే ఖర్చు పెడతామన్నారు. ఇల్లందు వ్యవసాయ  మార్కెట్ ను పూర్తిస్థాయిలో రన్ చేస్తామన్నారు. చిల్లర కౌంటర్లపై చర్యలు తీసుకుంటామన్నారు.

రూ 3 కోట్ల ఆదాయాన్ని పెంచడం జరిగిందన్నారు. వ్యవసాయ మార్కెట్ ద్వారా రైతులు పండించిన పంటల దోపిడీ జరగకుండా  వారే  గిట్టుబాటు ధర వచ్చేంతవరకు పంటలు ఉంచేందుకు  ప్రభుత్వం ద్వారా ఏసి గోదామును మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు ఏర్పాటు చేయుటకు హామీ ఇచ్చినట్లు శాసనసభ్యులు కోరం కనకయ్య  తెలిపారు. నియోజకవర్గంలో టేకులపల్లి, గార్ల,కామేపల్లి  మండలాల్లో మిర్చి,పత్తిని అధికంగా పండిస్తారని, బయ్యారం తదితర ప్రాంతంలో మక్కలు పండిస్తున్నారు. రైతుకు గిట్టుబాటు ధర ఏసి గోడౌన్  ద్వారానే వస్తుందన్నారు. ప్రభుత్వం ద్వారా ఏసి గోడౌన్  ఏర్పాటు కోసం మరొకసారి ప్రయత్నం చేస్తానన్నారు.

వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకమండలి బడ్జెట్లో ఈసారి నియోజకవర్గంలోని రైతులు తమ పంటలను తీసుకువచ్చే రహదారులు విషయంలో  ట్రాక్టర్లు, ట్రాలీలు ఆటోలు వచ్చేందుకు వరుస క్రమంలో ముఖ్యమైన రహదారులు  నిర్మిస్తామని తెలిపారు. ఇది రైతు ప్రభుత్వం అని ప్రజా ప్రభుత్వమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యవేక్షణలో తుమ్మల సారథ్యంలో ముగ్గురు మంత్రుల అండతో ఇల్లందు వ్యవసాయ మార్కెట్ కమిటీని అభివృద్ధి చేస్తామని, ఇల్లందు వ్యవసాయ మార్కెట్ ఆధ్వర్యంలో నియోజకవర్గ రైతులకు కావలసిన ముఖ్యమైన అవసరాలను తీర్చేందుకు సంక్షేమ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తామన్నారు. ఇల్లందు వ్యవసాయ మార్కెట్ కమిటీ పుట్టిన నాటి నుండి ఎప్పుడు టార్గెట్ ను మించని పరిస్థితిలోనేడు టార్గెట్ రీచ్ అవ్వడమే కాకుండా లాభాలలో తీసుకువచ్చిన పాలక మండలికి ఈ సందర్భంగా ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ బానోతు రాంబాబు, వైస్ చైర్మన్ బి.వెంకటేశ్వర్లు, ఇల్లందు పిఎసిఎస్ చైర్మన్ మెట్ల కృష్ణ, ఇల్లందు మాజీ మున్సిపల్  చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, ఇల్లందు మాజీ మున్సిపల్ చైర్మన్ ఎదలపల్లి అనసూయ, ఇల్లందు మండల ప్రజా పరిషత్ వైస్ చైర్మన్ మండల రాము, కాకాటి భార్గవ్, బాలాజీ నగర్ మాజీ సర్పంచ్ పాయం  స్వాతి, ఇల్లందు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొడ్డ డానియెల్, ఇల్లందు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పులి సైదులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు,  వ్యవసాయ మార్కెట్ కమిటీ సెక్రటరీ  సుచిత్ర,  వ్యవసాయ మార్కెట్ కమిటీ సెక్రటరీ నరేష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, డిస్టిక్ మార్కెటింగ్ ఆఫీసర్  జే. నరేందర్,  తదితరులు పాల్గొన్నారు.