01-04-2025 07:24:29 PM
హైదరాబాద్: హెచ్‌సీయూ భూముల(HCU lands)పై మంగళవారం తెలంగాణ సచివాలయం(Telangana Secretariat)లో మంత్రులు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) మాట్లాడుతూ... హెచ్‌సీయూకు చెందిన ఒక్క అడుగు భూమి కూడా ప్రభుత్వం తీసుకోలేదని, తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ పనికి అడ్డు తగిలితే ఉపేక్షించమని, హెచ్‌సీయూ వీసీ, రిజిస్ట్రార్ తో కూడా చర్చించామని.. వర్సిటి భూమి వర్సిటికే ఉందని తెలిపారు. 1500 ఎకరాలకు పైగా భూమిని హెచ్‌సీయూకు గతంలో కేటాయించారని, హెచ్‌సీయూ వద్ద ఉన్న జీవవైవిద్యాన్ని కాపాడతామన్నారు. నెమళ్ల కుంట, పర్యావరణానికి హాని కలుగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. 400 ఎకరాల ప్రభుత్వ భూమిని న్యాయపరంగానే తీసుకుంటున్నామని, అభివృద్దిని అడ్డుకోవాలనే కొందరి దుష్ప్రచారమని మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు.