ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి
హైదరాబాద్, నవంబర్ 12 (విజయ క్రాంతి) : రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీల మధ్య చీకటి ఒప్పందం జరిగిందని, పొంగులేటి ఇంటిపై ఈడీ రైడ్స్ జరిగితే ఏం జరిగిందో ఇప్పటివరకు ఎందుకు చెప్పలేద ని ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి నిలదీశా రు. మంగళవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పార్టీ లేకుండా కుట్రలు చేస్తున్నారని విమర్శించారు.
కేటీఆర్ భయపడి ఢిల్లీకి వెళ్లారని మంత్రులు పొంగులేటి, పొన్నం అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. అమృత్ టెండ ర్ల విషయంలో కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేస్తామని కేటీఆర్ ముందే చెప్పారని గుర్తు చేశారు. రేవంత్ 27 సార్లు ఢిల్లీకి వెళ్లినా ఇంతవరకు మంత్రివర్గ విస్తరణ జరగలేదని విమర్శించారు.
మూసీ అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని, మూసీ పేరుతో పేదల ఇళ్లు కూల్చడాన్ని తాము వ్యతిరేకిస్తున్నా మన్నారు. ఫార్మాసిటీకి 19వేల ఎకరాలు సిద్ధంగా ఉండగా లగచర్లలో 4వేల ఎకరాల భూమి సేకరణ ఎందుకని ప్రశ్నించారు.