26-02-2025 01:09:34 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లాలోని దోమల పెంట ఎస్ఎల్బీసీ టన్నెల్ ఘటన(SLBC Tunnel Incident)పై మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. టన్నెల్ లోపల జరుగుతున్న సహాయక చర్యలపై మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy), కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy) బీఎస్ఎఫ్(BSF) నుంచి పిలిపించిన టన్నెల్ వర్క్ నిపుణుల(Tunnel Works Experts)తో చర్చలు జరుపుతున్నారు. గత శనివారం ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) లోని 14వ కిలో మీటర్ వద్ద పైకప్పు కూప్పకులింది. ఈ ఘటనలో కొందరు కార్మికులు బయపడగా, ఎనిమిది మంది కార్మికులు సొరంగంలో చిక్కుకున్నారు. కార్మికులను కాపాడేందుకు రక్షణ బృందాలు గత నాలుగు రోజులుగా తీవ్రంగా శ్రమిస్తున్నాయి. దీంతో సహాయక చర్యలు కొనసాగుతున్న బృందాలు ప్రధాన అడ్డంకిగా ఉన్న చివరి 40 మీటర్ల ప్రాంతాన్ని దాటాయి. సొరంగంలో సుమారు 7 నుంచి 9 మీటర్ల ఎత్తున నిండిన పూర్తిగా మట్టిని తీస్తే తప్ప టీబీఎం ముందుభాగానికి వెళ్లలేని పరిస్థతి నెలకొందని అధికారులు వెల్లడించారు. దీంతో టీబీఎం వరకు చేరే దారులు వెతుకుతున్నామని, ఆటంకంగా ఉన్న బురద తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నామని టన్నెల్ వర్క్ నిపుణలు తెలిపారు.
ఆపరేషన్ మార్కోస్ పేరుతో సహయక చర్యలు ప్రారంభించింది. భూమి, నీరు ఆకాశంలో ఎక్కడైనా మార్కోస్ సహయక చర్యలు చేపడుతోంది. కమాండో బృందాలు మార్కొస్ గా పేరు. మార్కోస్ తో బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ భాగస్వామ్యం పనిచేస్తుంది. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా మార్కోస్ రెస్క్యూ చేసే సత్తా ఉంది. ఇండియన్ మెరైన్ కమాండో ఫోర్స్(మార్కోస్) రంగంలోకి దిగ్గింది. బీఆర్వో లెఫ్టినెంట్ కల్నల్ హరిపాల్ సింగ్ టీమ్(BRO Lieutenant Colonel Haripal Singh Team) టన్నెల్ వద్దకు చేరుకుంది. కార్గిల్ సహా కశ్మీర్ తదితర ప్రాంతాల్లో సంక్లిష్టతలను తట్టుకుని.. ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర ఇవాళ రెస్క్యూ ఆపరేషన్ చేయనుంది. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్ఎల్బీసీ టన్నెల్ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీకి వివరించారు.