calender_icon.png 24 October, 2024 | 4:00 AM

రాష్ట్ర వనరులు, సంపదను ప్రజలకే పంచుతాం : డిప్యూటీ సీఎం భట్టీ

10-07-2024 12:39:54 PM

ఖమ్మం : రైతు భరోసా పథకాన్ని అమలు చేసేందుకు విధి, విధానాలు రూపకల్పన కోసం ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా ఖమ్మం జిల్లాలో బుధవారం సదస్సును నిర్వహించింది. ఈ రైతు భరోసా సదస్సులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చైర్మన్‌గా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. రైతు భరోసా కార్యశాలకు రైతులు, రైతు సంఘాలకు వ్యవసాయ శాఖ ఆహ్వానించింది. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాల్లో రైతు భరోసా వర్క్ షాప్ లు ఇవాళ్టి నుంచి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.

ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నామని, రాష్ట్ర వనరులు, సందనను ప్రజలకే పంచుతామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నామని, రైతులు పెద్ద ఎత్తున ఆధారపడిన సాగు రంగాన్ని కాపాడుకుందామన్నారు. పంటలకు పెట్టుబడి సాయం కోసం రైతు భరోసా ఇస్తామని చెప్పారు. రైతు భరోసా అమలు చేయాలనే దృఢ సంకల్పంతో ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే రైతు బంధు కింద రైతులకు నిధులు విడుదల చేస్తామని, ఈ నెలలోనే పూర్తి స్థాయి బడ్జెట్ లో ప్రవేశ పెడుతామని డిప్యూటీ భట్టి విక్రమార్క తెలిపారు.