calender_icon.png 25 September, 2024 | 3:57 PM

ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేస్తాం

25-09-2024 12:49:10 PM

వెనుక బడ్డ పాలమూరు జిల్లా ను సస్యశ్యామలం చేసేందుకు ప్రభుత్వం కృషి

భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

పాలమూరు ఎత్తిపోతల పథకం ఉదండాపూర్ రిజర్వాయర్ ను సందర్శించిన మంత్రులు, ఎమ్మెల్యేలు

జడ్చర్ల,(విజయక్రాంతి): దశాబ్దాలుగా వెనుకబడిన ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టుల పనులను వేగవంతంగా పూర్తి చేసి ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకంలో భాగంగా జడ్చర్ల మండలంలోని ఉదండాపూర్ రిజర్వాయర్ ను బుధవారం రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, నాగర్ కర్నూలు ఎంపి మల్లు రవి, ఎమ్మెల్యేలు అనిరుద్ రెడ్డి, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, శ్రీహరి, వీర్లపల్లి శంకర్ లతో కలసి సందర్శించారు.

హైదరాబాద్ నుండి ప్రత్యేక హెలికాప్టర్ లో వచ్చిన మంత్రులు మొదటగా రూ.12 కోట్ల నిధులతో చేపడుతున్న వల్లూరు, కిష్టరం బిటి రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ మేరకు రిజర్వాయర్ కట్టను పరిశీలించారు. అనంతరం జరిగిన సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ... గత ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదని విమర్శించారు. కనీసం నీటి కేటాయింపులను సాదించుకోలేదని మండి పడ్డారు. గత పదేండ్ల కాలంలో  బీఆర్ఎస్ ప్రభుత్వం జిల్లా లోని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలేదని ఆరోపించారు. వెనుక బడ్డ పాలమూరు జిల్లాలో ప్రతి ఎకరాకు నీళ్లు అందించాలన్న చిత్తశుద్ధితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు  కృషి చేస్తున్నారని, ఏకకాలంలో అన్ని ప్రాజెక్టు లు పూర్తి చేస్తామన్నారు.

రైతన్నకు సాగునీరు అందించేందుకు ఎన్ని నిధులైన కేటాయించి పూర్తి చేస్తామని మంత్రి చెప్పారు. గత ప్రభుత్వంలో కేవలం రాజకీయ కుట్రలో భాగంగానే ప్రతి పనిని చేసుకుంటూ వచ్చాయని ప్రజలకు మంచి చేయాలన్న తపన వారికి లేదని విమర్శించారు. పక్క ప్రణాళికతో వాస్తవాలను ప్రజలకు ముందు ఉంచుతూ ప్రజాపలన ముందుకు సాగించడం జరుగుతుందని పేర్కొన్నారు.  ఉదండాపూర్ ప్రాజెక్టు నిర్వాసితుల కోసం రూ. 45 కోట్లు మంజూరు చేసినందుకు ఎంపి మల్లురవి, ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. 

మంచిని మంచి అని చెప్పని అసమర్థులు...

ప్రజలకు పూర్తిస్థాయిలో ప్రజా పాలన అందిస్తూ అందరి మన్ననలు పొందుతూ ముందుకు సాగరం జరుగుతుందని మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి అన్నారు. మంచిది మంచి అని కూడా చెప్పాలని పరిస్థితిలో బీఆర్ఎస్ నాయకులు ఉన్నారని ఇది ఎంతవరకు సమంజసం వారికి అర్థం కావాలన్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తి చేయడం వల్ల పాలమూరు ఎత్తిపోతల పథకం సమర్థవంతంగా ముందుకు సాగడం జరుగుతుందని తెలియజేశారు. అవసరాలను పక్కకు పెట్టి అనవసర ప్రాంతాలలో నిర్మాణాలు చేపట్టి ప్రజా జనాన్ని దుర్వినియోగం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడ? ఎప్పుడు?  ఏమిటి? ఏమిటి అనే వాస్తవాలను తెలియజేసుకుంటూ ప్రజాపాలన కొనసాగించడం జరుగుతుందని పేర్కొన్నారు.

ప్రతి విషయంలోనూ పారదర్శకంగా ముందుకు సాగుతున్నామని ప్రజలు పూర్తిస్థాయిలో ప్రజా ప్రభుత్వానికి మద్దతు తెలియజేయాలని సూచించారు. విలువైన సూచనలు ఇస్తే ప్రభుత్వం తీసుకుంటుందని ప్రతిపక్ష నాయకులు ప్రజలకు మంచి చేయాలని తపనతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని తెలియజేశారు. ఏదో మాట్లాడుతాం ఏదో చేస్తామంటూ కాలం గడిపితే ప్రజలు సరైన గుణపాఠం అవసరమైన టైంలో చెబుతారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉన్నత అధికారులు రామకృష్ణ, ప్రశాంత్ పాటిల్, అనిల్, జిల్లా కలెక్టర్ విజయేంద్రియ బోయి, ఎస్పీ జానకి, ఇరిగేషన్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.