01-04-2025 12:59:22 AM
హైదరాబాద్, మార్చి 31 (విజయక్రాంతి): పార్లమెంట్‌లో బీసీ బిల్లును ఆమోదించాలని బుధవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీసీ సంక్షేమ సంఘాలు మహాధర్నా నిర్వహించనున్నాయి. ఈ ధర్నాకు హాజరయ్యేందుకు మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్‌తో పాటు పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ కాంగ్రెస్ బీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, వివిధ పార్టీల నాయకులు మంగళవారం ఢిల్లీకి వెళ్లనున్నారు.
పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు ఇప్పటికే ఢిల్లీకి వెళ్లి దేశ వ్యాప్తంగా ఉన్న బీసీ నేతలను ఆహ్వానిస్తున్నారు. ధర్నాకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ హాజరై సంఘీభావం తెలిపే అవకాశం ఉందని పార్టీ నాయకులు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా హాజరుకానున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.