సాంప్రదాయ వస్త్రధారణతో సీతక్క, కోవలక్ష్మి...
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ఆదివాసి సాంప్రదాయం అంటేనే ఒక ప్రత్యేకమైన వస్త్రధారణతో మంత్రి సీతక్క(Minister Seethakka), ఎమ్మెల్యే కోవలక్ష్మి(MLA Kovalakshmi), ఆత్రం సుగుణ అందర్నీ ఆకట్టుకున్నారు. సోమవారం జంగుబాయి పుణ్యక్షేత్ర సందర్శనకు వచ్చిన మంత్రి, ఎమ్మెల్యే కట్టు బొట్టును మార్చి అందర్నీ ఆకర్షించారు. హట్టి వద్ద వారు ఆదివాసి సాంప్రదాయ వస్త్రధారణ చేసుకున్నారు. వారితో పాటు కాంగ్రెస్ నేత ఆత్రం సుగుణ సైతం సాంప్రదాయ దుస్తులు ధరించారు. గిరిజన సంప్రదాయ దుస్తులు ధరించిన మంత్రి సీతక్క, ఎమ్మెల్యే కోవ లక్ష్మి తమ సంస్కృతిని గుర్తు చేశారు.