22-04-2025 12:12:54 AM
సూర్యాపేట, ఏప్రిల్21(విజయక్రాంతి): సూర్యాపేట,నల్గొండ జిల్లాలో రేపు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించనున్నారు.చిలుకూరు మండలం నారాయణపురం నుండి బాలాజీ నగర్ వరకురూ. 20 కోట్లతో నిర్మించ తలపెట్టిన డబుల్ రోడ్ పనులకు శంకుస్థాపన చేస్తారు.
కోదాడ నియోజకవర్గ పరిధిలోని తోగార్రాయి నుండి సీత్ల తండా వరకురూ. 8 కోట్లతో నిర్మించ తలపెట్టిన రహదారి నిర్మాణం పనులకు శంకుస్థాపన, అదే నియోజకవర్గ పరిధిలోని కూచిపూడి నుండి తోగార్రాయి వరకు 12 కోట్లతో నిర్మించ తలపెట్టిన డబుల్ రోడ్ నిర్మాణపు పనులకు శంకుస్థాపచెయనున్నారు.
కోదాడ పట్టణంలో నిర్మిస్తున్న 100 పడకల ఆసుపత్రిలో నిర్మాణపు పనుల పరిశీలన, కోదాడ పట్టణంలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహావిష్కరణ , మిర్యాలగూడలో నకిరేకల్, దేవరకొండ, నాగార్జున సాగర్,మిర్యాలగూడ నియోజకవర్గలకు సంబంధించిన పౌర సరఫరాల శాఖా అధికారులతో సమీక్ష చేపట్టనున్నారు