హైదరాబాద్,(విజయక్రాంతి): రైతుల నుంచి చివరగింజ వరకూ కొనే బాధ్యత ప్రభుత్వానిదేనని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వం శుక్రవారం రైతు పండుగ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ... గత ప్రభుత్వం రుణమాఫీ చేయకుండా మోసం చేసిందని, తొలి ఐదేళ్లలో కేవలం రుణామఫీ కింద వడ్డీ చెల్లించిందని ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లో రూ.18 వేల కోట్లు రుణమాఫీ చేశామన్నారు.
తాము చేసిన రుణమాఫీకి బీఆర్ఎస్ చేసిన రుణమాఫీకి పోల్చి చూడండని మంత్రి చెప్పారు. ఈ వర్షాకాలంలో దేశంలోనే అధిక వరి పండించిన ఘనత తెలంగాణదేనని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ ఇంత మొత్తంలో వరి దిగుబడి రాలేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులకు మంచి పంట పండిందని, అందుకే మంచి ధర ఇస్తున్నామని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. సన్న ధాన్యానికి మద్దతు ధరకంటే రూ.500 అధనంగా చెల్లిస్తామని, దొడ్డు బియ్యానికి మద్దతు ధర చెల్లిస్తామని పేర్కొన్నారు.