calender_icon.png 25 January, 2025 | 6:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంత్రి ఉత్తమ్‌కు తప్పిన ప్రమాదం

25-01-2025 01:15:27 AM

  • జాన్‌పహాడ్ దర్గా ఉర్సుకు వెళ్తుండగా సడెన్ బ్రేక్ వేసిన కాన్వాయ్‌లోని ఓ కారు డ్రైవర్

ఒకదానికొకటి ఢీకొన్న ఆరు కార్లు

హుజూర్‌నగర్, జనవరి 24: మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కాన్వాయ్‌లో శుక్రవారం స్వల్ప ప్రమాదం చోటు చేసుకుంది. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ నియోజకవర్గం పాలకీడు మండలంలో జరుగుతున్న జాన్‌పహాడ్ దర్గా ఉర్సులో పాల్గొనేందుకు మం  ఉత్తమ్ తన కాన్వాయ్‌లో వెళ్తున్నారు.

గరిడేపల్లి పోలీసు స్టేషన్ ఎదురుగా కొందరు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉండటంతో వారిని కలిసేందుకు మంత్రి కారును ఆపారు. డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడంతో కాన్వాయ్‌లో వెనకాల ఉన్న నాయకులకు చెందిన 6 వాహనాలు ఒకదానికొకటి గుద్దుకున్నాయి.

దీంతో వాహనాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. దీంతో ట్రాఫిక్ జామ్ కావడంతో వెంటనే మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.