calender_icon.png 13 December, 2024 | 7:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిజాంసాగర్ నీటిని విడుదల చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్

13-12-2024 11:23:30 AM

యాసంగి పంట సాగు కోసం నీటి విడుదల

హార్షం వ్యక్తం చేసిన ఆయకట్టు రైతులు

మంత్రికి స్వాగతం పలికిన  జిల్లాలోని ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యే

కామారెడ్డి, (విజయక్రాంతి): ఉమ్మడి జిల్లాల రైతులకు వరప్రదాయనీ అయినా నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి యాసంగిలో పంట సాగు కోసం నిజాంసాగర్ ఆయకట్టుకు చెందిన ఉమ్మడి జిల్లాల రైతులు ప్రయోజనం కోసం సాగునీటిని విడుదల చేసినట్లు రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి తెలిపారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి మెయిన్ స్లోజు నుంచి ప్రధాన కాలువ ద్వారా నీటిని విడుదల చేశారు. అంతకుముందు బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి బొగ్గు గుడిసే వద్ద మంత్రికి స్వాగతం పలికారు.

బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు, రాష్ట్ర అగ్రో కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు, డిసిసి అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాసరావు, లు మంత్రికి స్వాగతం పలికారు. పుష్పగుచ్చం అందజేసి శాలువాలతో సన్మానించారు. జిల్లా కలెక్టర్ ఆశిష్ సంఘవన్ బాన్సువాడ అదనపు కలెక్టర్ కిరణ్మయి నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ఉమ్మడి జిల్లా రైతులకు యాసంగి సాగు కోసం నీటిని విడుదల చేసినట్లు తెలిపారు. రైతుల పక్షపాతి ప్రజా ప్రభుత్వం అని అన్నారు. యాసంగి పంటకు లక్ష 25 వేల ఎకరాలకు సాగు కు నీటిని విడుదల చేయడంలో ఉమ్మడి జిల్లాల రైతులు హర్షం వ్యక్తం చేశారు.