calender_icon.png 25 February, 2025 | 8:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రాణాలు కాపాడటమే మా ప్రథమ కర్తవ్యం: మంత్రి ఉత్తమ్

25-02-2025 05:21:53 PM

హైదరాబాద్: నాగర్ కర్నూల్ జిల్లాలోని దోమలపెంట ఎస్.ఎల్.బీ.సీ(Slbc Tunnel Collapse) ఘటనాస్థలిని తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka), మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy), జూపల్లి కృష్ణరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంగళవారం పరిశీలించారు. అనంతరం సహయచర్యల పర్యవేక్షణ తర్వాత జేపీ కార్యాలయంలో కీలక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ... సొరంగంలో చిక్కుకున్న వారి ప్రాణాలు కాపాడేందుకు సర్వశక్తుల ప్రయత్నిస్తున్నామని ఉత్తమ్ వెల్లడించారు. ప్రభుత్వ పరంగా చేయాల్సిన పనులన్నీ చేస్తున్నామని, రేపు మరికొందరు నిపుణులు రానున్నారని తెలిపారు. 

ఎన్‌జీఆర్‌ఐ, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్(Border Roads Organization) నిపుణులు రానున్నారని, దేశంలోనే ఎస్.ఎల్.బీ.సీ అత్యంత క్లిష్టమైన సొరంగమన్నారు. ఆర్మీ, నేవీ, జీఎస్ఐ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా తదితర నిపుణులు, ఎల్ అండ్ టీ, నవయుగ సంస్థల నిపుణులు పనిచేస్తున్నారని వెల్లడించారు. ఈ పది సంస్థల నిపుణులు అర్వింద్ కుమార్(Arvind Kumar) నేతృత్వంలో పనిచేస్తున్నారని పేర్కొన్నారు. కార్మికుల ప్రాణాలు కాపాడటమే తమ ప్రథమ కర్తవ్యమని, పరిస్థితిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గంటకోసారి అడిగి తెలుసుకుంటున్నారని ఉత్తమ్ కూమర్ రెడ్డి తెలిపారు.