నిజామాబాద్,(విజయక్రాంతి): రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉమ్మడి జిల్లాలైన నిజామాబాద్, కామారెడ్డిలో శుక్రవారం పర్యాటించనున్నారు. ఉదయం 10 గంటలకు హెలికాప్టర్ లో నిజాంసాగర్ ప్రాజెక్ట్ కు చేరుకోనున్న ఉత్తమ్ ఆయకట్టు ప్రధాన కాల్వ ద్వారా నీటిని విడుదల చేయనున్నారు. అనంతరం శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ చేరుకొని అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు.