calender_icon.png 11 January, 2025 | 6:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతు రుణమాఫీ చేసిన తొలి ప్రధాని మన్మోహన్ సింగ్

30-12-2024 02:05:41 PM

హైదరాబాద్: తెలంగాణ శాసనసభ ప్రత్యేక సమావేశాలు సోమవారం కొనసాగుతున్నాయి. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) మృతి పట్ల సంతాపం తెలుపుతూ సభ తీర్మానం చేసింది. సభలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. మన్మోహన్ సింగ్ వివిధ పదవులను నిర్వహించారు. విప్లవాత్మకమైన భూసేకరణ చట్టం తెచ్చారని వెల్లడించారు. దేశ క్షేమం దృష్ట్యా న్యూక్లియర్ ఒప్పందం(Nuclear deal) కుదుర్చుకున్నారని చెప్పారు. న్యూక్లియర్ ఒప్పందంపై వ్యతిరేకత ఉన్నా.. దేశ క్షేమం దృష్ట్యా ఒప్పందం చేసుకున్నారని వివరించారు.

మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని టోటు అని మంత్రి వెల్లడించారు. రైతులకు రుణమాఫీ చేసిన తొలి ప్రధాని మన్మోహన్ అన్నారు. సోనియా సూచనల మేరకు మన్మోహన్ గొప్ప చట్టాలు తీసుకొచ్చారని ప్రశంసించారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడే గ్రామీణ ఉపాధి హామీ చట్టం తీసుకొచ్చారని గుర్తుచేశారు.  ప్రభుత్వంలో ఉన్నవారు జవాబుదారీగా ఉండాలని ఆర్టీఐ తెచ్చారని, ప్రజాసొమ్ముతో చేసిన పనుల వివరాలు తెలుసుకునే హక్కు ఆర్టీఐ ద్వారా లభించిందన్నారు. ఆకలి చావులు ఉండకూడదని, మన్మోహన్ సింగ్ ఆహార భద్రత చట్టం తెచ్చారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) వెల్లడించారు.