calender_icon.png 15 January, 2025 | 11:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్లుకు నీరందిస్తాం : మంత్రి ఉత్తమ్

17-07-2024 03:46:36 PM

హైదరాబాద్ : ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. పాలమూరు-రంగారెడ్డి, నెట్టెంపాడు ప్రాజెక్ట్, భీమా, నారాయణపేట-కొడంగల్ ప్రాజెక్ట్, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పరిస్థితి, ప్రాజెక్టుల పూర్తికి ఏ చర్యలు తీసుకోవాలో చర్చించామని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. ఇతర ప్రాజెక్టుల పూర్తి చేయడంపై కూడా చర్చించామని, బడ్జెట్ లో ఇరిగేషన్ శాఖకు రూ.28 వేల కోట్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరతామని మంత్రి చెప్పారు.

కొత్త ప్రాజెక్టుల పనుల కోసం రూ.8 వేల కోట్లు కేటాయించామని, తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్లుకు నీరందిస్తామన్నారు. త్వరలోనే ఇరిగేషన్ శాఖలో పదోన్నతులు, బదిలీలు ఉంటాయని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. ఈనెల 20వ తేదీన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీలో ఎన్డీఎస్ఏ ఛైర్మన్ తో మంత్రి భేటీ కానున్నారు.