calender_icon.png 16 April, 2025 | 3:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్సీ వర్గీకరణలో మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి కీలకపాత్ర

14-04-2025 06:39:04 PM

ఎస్సీ వర్గీకరణ జీవో విడుదల చేయడం హర్షినీయం..

ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నది కాంగ్రెస్ పార్టీ..

కాంగ్రెస్ నాయకులు తెలంగాణ మలిదశ ఉద్యమకారులు రాయపూడి వెంకటనారాయణ..

కోదాడ: ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ప్రభుత్వం సోమవారం జీవోను విడుదల చేసింది. ఈ పరిణామంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ ఉప కులాలకు (SC Sub-Caste) 15 శాతం రిజర్వేషన్లు అధికారికంగా అమల్లోకి రానున్నాయని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణ మలి దశ ఉద్యమకారులు రాయపూడి వెంకటనారాయణ అన్నారు. కోదాడ పట్టణంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ....ఎస్సీ ఉపకులాల దశాబ్దాల కల ఎట్టకేలకు నెరవేరింది.

ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ భాషల్లో అధికారులు గెజిట్ కూడా విడుదల చేశారు. ఎస్సీల్లో ఉన్న మొత్తం 59 ఉప కులాలను మూడు గ్రూపులుగా విభజించి కేటాయింపులు చేశారు. సామాజికంగా, విద్యా పరంగా, ఆర్థికంగా పూర్తిగా వెనుకబడిన వారిలో 15 ఉప కులాలు ఉన్నాయని గుర్తించి గ్రూప్‌-ఏ కింద ఉన్న వారికి ఒక శాతం రిజర్వేషన్లు కేటాయించారు. అదేవిధంగా మధ్యస్థంగా లబ్ధి పొందిన 18 ఉప కులాలకు గ్రూప్‌-బీ కింద ఉన్న వారికి 9 శాతం, గణనీయంగా లబ్ధిపొందిన 26 ఉప కులాలను గ్రూప్‌-సీ కింద ఉన్న వారికి 5 శాతం రిజర్వేషన్లు వర్తించనున్నాయి అన్నారు. ఎస్సీ వర్గీకరణ తో కాంగ్రెస్ పార్టీ చరిత్రలో నిలిచిపోతుందన్నారు. వర్గీకరణలో పౌరసరఫరాల నీటిపారుదల శాఖ మంత్రి, సబ్ కమిటీ చైర్మన్ ఉత్తంకుమార్ రెడ్డి పాత్ర కీలకమని అన్నారు.