calender_icon.png 30 September, 2024 | 4:52 AM

మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి పితృవియోగం

30-09-2024 12:41:05 AM

అనారోగ్యంతో ఆయన తండ్రి పురుషోత్తంరెడ్డి మృతి

హైదరాబాద్, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తండ్రి పురుషోత్తం రెడ్డి ఆదివారం తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పురుషోత్తం రెడ్డి హైదరాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందా రు.

పురుషోత్తం రెడ్డి భౌతికకాయాన్ని సందర్శానార్ధం ఆస్పత్రి నుంచి ఉత్తమ్ ఇంటికి తరలించారు. పెద్దఎత్తున నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చి పురుషో త్తం రెడ్డికి నివాళి అర్పించారు. జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో అంత్యక్రి యలు నిర్వహించారు. 

స్వగ్రామంలో విషాదం..

మంత్రి ఉత్తమ్ తండ్రి మరణంతో వారి స్వస్థలమైన సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం తాటిపాములలో విషాదఛాయ లు అలుముకున్నాయి. పురుషోత్తం రెడ్డి మరణ వార్త విన్న గ్రామస్తులంతా శోకసంద్రంలో మునిగిపోయారు. ఆయన భౌతికకా యానికి నివాళి అర్పించేందుకు పలువురు గ్రామస్తులు హైదరాబాద్‌కు వచ్చారు. 

పలువురి సంతాపం..

మంత్రి ఉత్తమ్ తండ్రి మరణం పట్ల సీఎం రేవంత్‌రెడ్డితో సహా మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఆయా పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు సం తాపం తెలియజేశారు. పలువురు పురుషోత్తం రెడ్డి భౌతిక కాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీతక్క, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభా కర్, ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి, చీఫ్ విప్ బీర్ల అయిలయ్య, ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, బీఆర్‌ఎస్ నాయకులు కేటీఆర్, హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు వివేక్‌గౌడ్, డా.సంజయ్‌కుమార్ తదితరులు నివాళి అర్పించారు.

ధైర్యంగా ఉండండి

పురుషోత్తం రెడ్డి మరణం పట్ల బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణి ప్రార్థించారు. మంత్రి కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని కోరారు.

మంత్రి ఉత్తమ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి

రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తండ్రి పురుషోత్తం రెడ్డి మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఆయన సతీమణి పద్మావతిరెడ్డి, కుటుంబ సభ్యులకు సీఎం సానుభూతి తెలిపారు.

ఆత్మకు శాంతి చేకూరాలి 

నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కు టుంబానికి నా ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నా. పురుషోత్తం రెడ్డి ఆత్మ కు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ని ప్రార్థించా. 

 మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

యువతకు ఉపాధి కల్పించారు

మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తండ్రి పురుషోత్తం రెడ్డి బీహెచ్‌ఈఎల్‌లో పనిచేసిన సమయంలో అనేక మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించారు. సాగర్ సిమెంట్‌లోనూ కీలక బాధ్యతలు చేపట్టారు. పురుషోత్తం రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవున్ని కోరుతున్నా.           

మంత్రి సీతక్క

కలిచివేసింది..

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి పురుషోత్తం రెడ్డి మరణ వార్త నన్ను కలిచివేసింది. ఉత్తమ్ కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని ఆ దేవున్ని వేడుకుంటున్నా.

       మంత్రి పొన్నం ప్రభాకర్