30-03-2025 08:24:54 PM
హుజూర్‌నగర్: సూర్యపేట జిల్లా హుజూర్ నగర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆదివారం పర్యటించారు. శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా హుజూర్‌నగర్ నుంచి సన్నబియ్యం పంపిణీ పథకాన్ని ముఖ్యమంత్రి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమర్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి ఉత్తమ్ కుమర్ రెడ్డి మాట్లాడుతూ... దేశంలో ఏ రాష్ట్రంలోనూ రేషన్ కార్డులపై సన్న బియ్యం పంపిణీ లేదని, తొలిసారిగా తెలంగాణ రాష్ట్ర(Telangana Govt)మే సన్నబియ్యం ఇస్తొందని మంత్రి తెలిపారు. ప్రస్తుతం ఇస్తున్న దొడ్డు బియ్యాన్ని ప్రజలు తినటం లేదని, దొడ్డు బియ్యంపై ప్రభుత్వం రూ. 10,600 కోట్లు ఖర్చు చేస్తోందని అన్నారు.
దొడ్డు బియ్యంపై ప్రభుత్వం కిలోకు రూ. 40 ఖర్చు చేస్తోందని, కిలోకు రూ. 40 ఖర్చు చేసి ఇచ్చినా ప్రజలు వాటిని తినటం లేదన్నారు. ప్రజలు దొడ్డుబియ్యం తినకపోవడంతో అది పక్కదారి పడుతుందని, అందుకే ఇంకొంచెం అధిక ధరకు కొనుగోలు చేసి సన్నబియ్యం ఇస్తున్నమని మంత్రి వివరించారు. గత ప్రభుత్వం పదేళ్ల పాటు రేషన్ కార్డులు ఇవ్వలేదని, ఈ ప్రభుత్వం త్వరలోనే కొత్త రేషన్ కార్డులు ఇవ్వనుందని అన్నారు. దేశంలో పేదల కోసం ఆహర భద్రత చట్టాన్ని చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, ఆహర భద్రత చట్టం(Food Security Act) వల్లే దేశంలో రేషన్ కార్డులు, బియ్యం పంపిణీ జరుగుతుందని మంత్రి ఉత్తమ్ కుమర్ రెడ్డి తెలిపారు.