10-04-2025 05:43:54 PM
హైదరాబాద్: జలసౌధ నుంచి పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) గురువారం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్(Video conference) నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ అధికారులతో మాట్లాడుతూ... సన్నబియ్యం లబ్దిదారుల ఇంట్లో ప్రజాప్రతినిధులు ఖచ్చితంగా భోజనం చేయాల్సిందేనని సూచించారు. సన్నబియ్యం పంపిణీపై ప్రతిపక్షాల ఆరోపణాలను తిప్పికొట్టాలని మంత్రి ఉత్తమ్ తెలిపారు. గతంలో 24 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డుబియ్యం పంపిణీ జరిగేదాని, ప్రస్తుతం 30 లక్షల మెట్రిక్ టన్నుల సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. సన్నబియ్యం పంపిణీకి ఏటా రూ.13,600 కోట్ల వ్యయం అవుతుందని, గతం కంటే 29 లక్షల రేషన్ కార్డులు పెరిగాయని వెల్లడించారు. కేంద్రం సన్నబియ్యం ఇస్తుందనడం అవాస్తవమని వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.