సూర్యాపేట: తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్వాయ్ లో కార్లు ఢీకొన్నాయి. హుజూర్ నగర్ నుంచి జాన్ పహాడ్ ఉర్సు ఉత్సవాలకు వెళ్తుండగా గరిడేపల్లి వద్ద జరిగిన ఈ ప్రమాదం జరిగింది. సడన్ బ్రేక్ వేయడంతో ఒక కారు మరో కారును ఢీకొనడంతో నాయకుల ఎనిమిది కార్ల ముందు బాగాలు, బానెట్లు స్పల్పంగా దెబ్బతిన్నాయి. ప్రమాదం తప్పడంతో నేతలు, కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు.