calender_icon.png 2 April, 2025 | 6:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీతారామ కళ్యాణ ఏర్పాట్లు పరిశీలించనున్న మంత్రి తుమ్మల

31-03-2025 04:32:43 PM

భద్రాచలం (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, చేనేత జౌళి శాఖ మాత్యులు తుమ్మల నాగేశ్వరరావు మంగళవారం నాడు భద్రాచలంలో పర్యటిస్తున్నట్లు ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సోమవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ ఒకటో తారీకు ఉదయం 10 గంటలకు సుభాష్ నగర్ కూనవరం రోడ్డులో కొత్తగా నిర్మాణం చేపడుతున్న కరకట్ట పనులను పర్యవేక్షిస్తారని, ఉదయం 10:30 కు మిథిలా స్టేడియంలో శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణం, పట్టాభిషేకం సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా శాఖల అధికారులతో శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణం, పట్టాభిషేకం నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహిస్తారని, సంబంధిత అధికారులు వారికి అప్పగించిన బాధ్యతలకు సంబంధించిన పూర్తిస్థాయి నివేదికలతో ఈ సమావేశమునకు సకాలంలో హాజరుకావాలని ఆయన కోరారు.