calender_icon.png 25 October, 2024 | 5:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మలేషియా సాయం కోరిన మంత్రి తుమ్మల

25-10-2024 03:46:51 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): మలేషియాలో మూడో రోజు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటిస్తున్నారు. మలేషియా వ్యవసాయశాఖ మంత్రి మహ్మద్ బిన్ సాబుతో మంత్రి తుమ్మల భేటీ అయి రాష్ట్రంలో అగ్రిప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పాలని కోరారు. ఫెల్డా ఛైర్మన్ అహ్మద్ షాబేరితో సమావేశమైన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆయిల్ పామ్ సాగు విధానం నూనె గింజల ఉత్పత్తి రైతులకు ఉపయోగపడే పద్దతులపైన, తదితర అంశాలపై చర్చించారు. మాలేషియాలో భారత్ హై కమిషన్ బీఎన్ రెడ్డిని కలిశారు. యాంత్రీకరణకు సంబంధించి తెనాసియా కంపెనీని సందర్శించిన తుమ్మల యంత్రాలు, పనిముట్లను పరిశీలించారు.  మంతి తుమ్మల వెంట వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ఉద్యానశాఖ కమిషన్ యాస్మిన్ భాషా, అధికారులు సరోజిని, ఓఎస్టీ శ్రీధర్ ఉన్నారు.