హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణలో పత్తి సేకరణపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పత్తి కొనుగోళ్లపై మార్కెటింగ్ శాఖ అధికారులు పాల్గొన్నారు. రోజువారీ పత్తి సరకు వివరాలను పర్యవేక్షించాలని మంత్రి ఆదేశించారు. సీసీఐ కుంద్రాల్లో పత్తిని విక్రయించాలని రైతులకు సూచనలు చేశారు. సీసీఐ నిర్ణయించిన ప్రమాణాలు పాటించాలన్నారు. రైతులందరూ తమ పత్తి పంటను ప్రైవేట్ సంస్థలకు తక్కువ ధరకు విక్రయించి నష్టపోవద్దని మంత్రి సూచించారు. మార్కెటిగ్ శాఖ అధికారులు తీసుకొచ్చిన వాట్సప్ ద్వారా పత్తి కొనుగోలు కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకొని, గరిష్ఠ మద్దతు ధర పంటను విక్రయించాలని మంత్రి తుమ్మల చెప్పారు.