హైదరాబాద్ : రైతు లోకానికి పెద్ద పండుగ రోజు అని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. గతంలో కాంగ్రెస్ హయంలో పెద్ద ఎత్తున రైతు రుణమాఫీ జరిగిందని గుర్తు చేశారు. గతంలో దేశం మొత్తానికి రూ.70 వేల కోట్లు రైతు రుణమాఫీ జరిగిందన్నారు. ఇచ్చిన హామీ మేరకు రైతు పంటల రుణమాఫీ అమలు జరుగుతుందోని తుమ్మల తెలిపారు. ఆగస్టు 15లోగా రుణమాఫీ అమలు చేస్తామని సీఎం హామీ ఇచ్చారని, ఎన్ని ఇబ్బందులు ఉన్నా రుణమాఫీ అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్ర ఖజానాకు ఎక్కువ ఆదాయం ఇచ్చేలా కృషి చేయాలని, అన్ని రంగాల్లో తెలంగాణను ముందుకు తీసుకెళ్లాలని, వ్యవసాయాన్ని రైతులకు భరోసా ఇచ్చేలా చూడాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సీఎం రేవంత్ రెడ్డిని కోరారు.