calender_icon.png 23 December, 2024 | 10:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంక్రాంతి నుంచి రైతుభరోసా విడుదల: మంత్రి తుమ్మల

21-12-2024 10:29:39 AM

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రైతు భరోసా విధివిధానాలపై శాసనసభలో స్పల్పకాలిక చర్చ జరుగుతోంది. చర్చ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. సంకాంత్రి నుంచి రైతభరోసా విడుదల చేస్తామన్నారు. జనవరి నాటికి విధివిధానాలు రూపకల్పన చేస్తామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు పథకం ప్రారంభించింది. ఏఈవోలు యాపుల సాయంతో పంటల నగదు సర్వే ప్రారంభించారని చెప్పారు.  ధరణి పోర్టల్ లో ఉన్న వివరాల ప్రకారం రైతుబంధు ఇచ్చారని మంత్రి తుమ్మల తెలిపారు. రైతుబంధు కింద ఇప్పటి వరకు రూ. 80,453 కోట్లు ఇచ్చారన్న మంత్రి రూ. 21283.66 కోట్ల రైతుబంధు నిధులు, సాగుచేయని భూముల కోసం విడుదల చేశారని ఆరోపించారు. 2018 నుంచి పంటల సర్వే వ్యవసాయశాఖ బాధ్యతగా మారిందన్నారు.