calender_icon.png 5 November, 2024 | 3:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పత్తి కొనుగోళ్లపై రైతులు సంప్రదించాల్సి వాట్సాప్ నెంబర్ ఇదే...

05-11-2024 01:45:09 PM

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంగళవారం నాడు సమీక్ష నిర్వహించారు. సమీక్షలో మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ ఉదయ్ కుమార్ పాల్గొన్నారు. నోటఫై చేసిన ప్రతి జిన్నింగ్ మిల్లు పనిచేయాలని మంత్రి తుమ్మల ఆదేశించారు. తేమ శాతం సడలింపులపై సీసీఐ సీఎండీకి మంత్రి తుమ్మల విన్నవించారు. పత్తి కొనుగోళ్లపై రైతులు ఈ 8897281111 వాట్సాప్ నంబర్ ను సంప్రదించాలన్నారు. రైతులు సమీప కొనుగోలు కేంద్రాల వద్ద పత్తి అమ్ముకోవాలని తుమ్మల సూచించారు. సమస్యలపై కలెక్టర్లు, మార్కెటింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పత్తి తేమ శాతం 8-12 మధ్య ఉం డేలా రైతులు చూసుకోవాలని  తెలిపారు.