హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన రుణామాఫీపై ప్రతివిషయం రికార్డులు ఉన్నాయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు తెలిపారు. 2018 నుంచి కాంగ్రెస్ ప్రమాణస్వీకారం చేసిన రోజు వరకు తీసుకున్న రుణాలు మాఫీ చేస్తామని చెప్పామని తుమ్మల గుర్తుచేశారు. బీఆర్కే భవన్ లో మంత్రి తుమ్మల మీడియా సమావేశంలో మాట్లాడుతూ... 42 లక్షల మంది రైతు రుణాలు తీసుకున్నారని తెలిపారు. తెల్లరేషన్ కార్డులు ఉన్నవారికి రుణమాఫీ జరిగిందన్నారు. రూ. 2 లక్షల కంటే ఎక్కు ఉన్న వారికి కూడా మాఫీ చేస్తామని చెప్పామన్నారు. నష్టపరిహారం కోసం ఎకరాకు రూ. 10 వేలు ఇస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. ప్రతి పంటకు బీమా ప్రభుత్వమే కడుతుందని ఆయన పేర్కొన్నారు.