స్వతంత్ర ఫలాలు అర్హులకు దరి చేరాలి
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
భద్రాద్రి కొత్తగూడెం, (విజయక్రాంతి): స్వాతంత్ర ఫలాలు అర్హులైన నిరుపేదలకు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం కొత్తగూడెం ప్రగతి మైదానంలో జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా అని రంగాల్లో ప్రగతి పథంలో అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం దృడ నిశ్చయంతో ఉందన్నారు. జాతీయ జెండాను ఎగరవేసిన అనంతరం పోలీస్ గౌరవ వందనాలు స్వీకరించారు. జిల్లాలో వివిధ శాఖల్లో ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగస్తులకు అవార్డులు అందజేశారు. విద్యార్థిని విద్యార్థులు ఆలరించిన సాంస్కృత కార్యక్రమాలు చూపర్లను ఆకర్షించాయి. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం అశ్వరావుపేట ఎమ్మెల్యేలు సాంబశివరావు, జారే ఆదినారాయణ, కలెక్టర్ జితేష్ బి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.