సూర్యాపేట్,(విజయక్రాంతి): టేకుమట్ల వద్ద ఐకేపీ కేంద్రాన్ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం ఉదయం పరిశీలించారు. ఖమ్మ నుంచి హైదరాబాద్ తన వాహనంలో వస్తున్న మంత్రి మార్గమధ్యలో సూర్యపేట్ జిల్లాలోని టేకుమట్ల ఐకేపీ కేంద్రం వద్ద ఆగి ధాన్యం కోనుగోలు ప్రక్రియను పరిశీలించి కలెక్టర్ తో మాట్లాడారు. రైతులకు అసౌకర్యం కలగకుండా సమర్థవంతమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. అనంతరం అక్కడ ఉన్న రైతులతో కాసేపు మాట్లాడారు. వడ్లలో తాలు లేకుండా చూసుకోవాలని, అప్పుడే రైతులు పండించిన పంటకు మంచి ధర వస్తుందని సూచించారు. ఇక పంట వ్యర్థాలను కాల్చొద్దని, అలా కలిస్తే భూమిలో ఉన్న సారం తగ్గుతుందన్నారు. ఈ విషయాన్ని మిగతా రైతులకు కూడా చెప్పాలని కోరారు. అనంతరం అక్కడి నుంచి హైదరాబాద్ బయల్దేరారు.