ఖమ్మం జిల్లాలో రహదారులు విస్తరించాలని వినతి
ఖమ్మం, జనవరి 28 (విజయక్రాంతి): ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జాతీయ రహదారుల అభివృద్ధికి చర్యలు తీసుకుని, జిల్లా పురోగతికి మరింతగా సహకరించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర రోడ్డు, రవాణ, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో పాటు రీజినల్ ఆఫీసర్ నేషనల్ హైవేస్ హైదరాబాద్‌కు మంగళవారం లేఖ రాశారు.
రహదారుల నిర్మాణంతోనే జిల్లా అభివృద్ధి సాధ్యమవుతుందని లేఖలో పేర్కొన్నారు. పలు చోట్ల బ్రిడ్జీల నిర్మా పాటు సెంట్రల్ లైటింగ్, సైడ్ డ్రైన్స్, మర్మమతులు చేపట్టాలని లేఖలో కేంద్ర మంత్రిని కోరారు. భద్రాచల ఆలయ అభివృద్ధికి, పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు సహకరించాలని కోరారు.