హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శనివారం లేఖ రాశారు. తిరుమల దర్శనంలో తెలంగాణ సిఫార్సు లేఖలపై తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీలో కోరాలన్నారు. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు పరిగణనలోకి తీసుకోవలని తుమ్మల కోరారు. లేఖలకు టీటీడీ ప్రాధాన్యం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎంకు విజ్ఞప్తి చేయాలన్నారు.