calender_icon.png 12 February, 2025 | 5:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రకాష్‌నగర్ బ్రిడ్జిని పరిశీలించిన మంత్రి తుమ్మల

12-02-2025 12:59:35 AM

  1. నేటి నుంచి రాకపోకలు 
  2. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా 
  3. మీడియాతో మంత్రి తుమ్మల 

ఖమ్మం, ఫిబ్రవరి 11 (విజయక్రాంతి) : ఎట్టకేలకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేకించి,తీసుకున్న చొరవ ఫలితంగా ఖమ్మం మున్నేరుపై నిర్మించిన ప్రకాశ్ నగర్ వంతెనను పునరుద్ధరించి, బుధవారం నుం చి రాకపోకలు ప్రారంభించడం పట్ల సర్వత్రా హర్షం.. వ్యక్తమవుతున్నది.

ఖమ్మం మున్నే రు చరిత్రలో గతంలో ఎన్నడూ రాని విధం గా పోయినవర్షాకాలంలో భారీ ఎత్తున వరదలు రావడంతో ఈ వంతెనకు సంబం ధించిన 9 స్పాన్లు పక్కకుఒరిగిపోవడంతో ఏడు నెలల కిందట తిరిగి పునరుద్ధరిం చేందుకు ఈ వంతెన పై రాకపోకలు బంద్ చేసి, మూసివేశారు.

ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి, పక్కకు ఒరిగిపోయిన 9 స్పాన్లను అన్నింటిని మళ్ళీ యాధాస్థితికి తీసుకొచ్చారు. దీంతో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మలనాగేశ్వరావు మంగళవారం వంతెన వద్దకు చేరుకుని, వంతెనను పరిశీలించి, అధికారులతో మాట్లాడారు. 

ఇచ్చిన మాట నిలుపుకున్నా...

ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లా డుతూ వర్షాకాలంలో ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుని, తిరిగి బ్రిడ్జిని ప్రజలకు అంకితం చేశానని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. వంతెన వద్ద మీడియాతో మాట్లాడారు. గత సెప్టెంబర్లో మున్నేరుకు వచ్చిన భారీ వరదలకు ఈ వంతెన దెబ్బతి న్నదని, ఆధునిక టెక్నాలజీతో ఆర్‌అండ్బి శాఖఆధ్వర్యంలో డిస్ ప్లేస్ అయిన స్పాన్స్ను యధాస్థితికి తీసుకురా వడం జరిగిందని వివరించారు.

ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు వచ్చే రైతులకు ఈ వంతెన ఎంతో కీలకం కావడంతో యుద్ధప్రాతిపదికన పూర్తి చేయ డం జరిగిందని అన్నారు. బుధవారం నుంచి ఈ వంతెనపైకి రాకపోకలకు అనుమతించ డం జరుగుతుందని తెలిపారు.