calender_icon.png 13 November, 2024 | 9:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రుణమాఫీపై చిల్లర రాజకీయాలు.. రైతులు పట్టించుకోవద్దు

11-11-2024 07:37:25 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): ధంసలాపురం వద్ద నేషనల్ హైవే పనులను మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సోమవారం పరిశీలించారు.  రూ.2 లక్షలలోపు రుణం ఉన్న 22 మంది రైతులకు రుణమాఫీ చేశామని మంత్రి తెలిపారు. రేషన్ కార్డ్ నిర్ధారణ కాని 4 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తామని పేర్కొన్నారు. రూ.2 లక్షలపైన రుణం ఉన్న రైతులకు షెడ్యూల్ ఇచ్చి మాఫీ చేస్తామని, ఇచ్చిన మాట ప్రకారం రూ.31 వేల కోట్లు రుణమాఫీ పూర్తి చేస్తామని తుమ్మల చెప్పారు. ఇది దేశలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రైతులకు మహర్దశ అని, రుణమాఫీపై చిల్లర రాజకీయాలు చేసే పార్టీల గురించి రైతులు ఆలోచించకుడదని సూచించారు. వచ్చే ఆగస్ట్ 15 కల్ల సాగర్ కెనాల్ పై లిఫ్ట్ ఏర్పాటు చేసి రఘు నాథపాలెం మొత్తం సస్యశ్యామలంగా మారుస్తామని మంత్రి తుమ్మల తెలిపారు.