calender_icon.png 21 October, 2024 | 11:52 AM

ఈ సారి పత్తి దిగుబడి తగ్గింది: మంత్రి తుమ్మల

21-10-2024 10:04:49 AM

హైదరాబాద్: ఖమ్మం జిల్లా గుర్రాలపాడులో పత్తి కొనుగోలు కేంద్రాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 40 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారని మంత్రి తుమ్మల వెల్లడించారు. వాతావరణ పరిస్థిల దృష్ట్యా ఈ సారి పత్తి దిగుబడి తగ్గిందని మంత్రి వెల్లడించారు. ఖమ్మం జిల్లాలో 17 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ఖమ్మం జిల్లాలో 9 సీసీఐ కొనుగోలు కేంద్రాల ద్వారా పత్తి కొనుగోలు చేస్తున్నట్లు మంత్రి సూచించారు.

రైతులకు ఇబ్బంది లేకుండా రెవెన్యూ, మార్కెటింగ్ అధికారులే చూడాలని తుమ్మల ఆదేశించారు. పత్తి రైతులను మోసం చేసే ప్రైవేట్ వ్యాపారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతులు సంప్రదాయ పంటల నుంచి ఉద్యాన పంటల వైపు మళ్లాలని తుమ్మల పిలుపునిచ్చారు. పత్తి, మిర్చి స్థానంలో పామాయిల్ సాగు చేస్తే అధిక లాభం వస్తుందన్నారు. రైతులకు గిట్టుబాటు ధర అందించాలనేదే తమ ప్రభుత్వ సంకల్పం అని మంత్రి పేర్కొన్నారు.