calender_icon.png 13 December, 2024 | 10:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భవనాలను ప్రారంభించిన మంత్రి తుమ్మల

13-12-2024 05:16:24 PM

అశ్వారావుపేట (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలోని దమ్మపేట మండలం అల్లిపల్లి గ్రామంలో రూ.20 లక్షలతో నిర్మించిన  భవనాలను తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ & టెక్స్టైల్ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణతో కలిసి శుక్రవారం ప్రారంభించారు. రూ.20 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీనీ, పంచాయతీలోని శివారు గ్రామమైన సత్యనారాయణపురంలో గ్రామస్తుల సహకారంతో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ప్రారంభించారు.

అనంతరం అల్లిపల్లి గ్రామపంచాయతీలో ఇటీవల ఎమ్మెల్యే గారి చొరవతో నిర్మించిన సీసీ రోడ్లు కల్వర్టులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మద్దిశెట్టి సత్య ప్రసాద్, సీనియర్ నాయకులు ఆలపాటి రామచంద్ర ప్రసాద్, జిసిసి చైర్మన్ యెళ్లిన రాఘవరావు, దమ్మపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ వాసం రాణి శ్రీనివాస్, పలువురు అధికారులు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.