calender_icon.png 18 November, 2024 | 6:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెద్దవాగు స్థితిగతులు, నష్టాలను సీఎంకి వివరించిన మంత్రి తుమ్మల

20-07-2024 03:32:41 PM

హైదరాబాద్ : రాష్ట్రంలో గత రెండు మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పెద్దవాగు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతుంది. దీంతో పెద్దవాగు ప్రాజెక్ట్ స్థితిగతులు, నష్టాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వివరించారు. పెద్దవాగు వరద వల్ల నష్టపోయిన రైతుల వివరాలను సేకరించాలని సీఎం మంత్రి తుమ్మలకు చెప్పారు. దీంతో తుమ్మల నష్టపోయిన రైతుల వివరాలను సేకరించాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం రైతులకు ప్రత్యామ్నాయ పంటల కోసం ఇన్ పుట్ సబ్సిడీపై పరిశీలిస్తుంది. పెద్దవాగుకు గండి పడి వేల సంఖ్యలో పశువులు గల్లంతు కాగా, వేల ఎకరాల పంట పొలాలు దెబ్బతిన్నాయి.