calender_icon.png 8 April, 2025 | 3:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శభాష్ బాగా కంట్రోల్ చేశారు..

07-04-2025 09:07:24 PM

కలెక్టర్, ఎస్పీలకు మంత్రి తుమ్మల అభినందన..

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): భద్రాచలం పుణ్యక్షేత్రంలో ఆదివారం జరిగిన శ్రీసీతారాముల కళ్యాణం విజయవంతం కావడంలో ప్రముఖ పాత్ర వహించిన భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజ్ లను మంత్రి తుమ్మల అభినందించారు. సోమవారం గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ రాక కోసం హెలిపాడ్ వద్ద మంత్రి తుమ్మల కలెక్టర్, ఎస్పీలకు ఒకేసారి షేక్ హ్యాండ్ ఇచ్చి దగ్గరకు తీసుకున్నారు. లక్షలాది మంది భక్తులు వచ్చినా, ముఖ్యమంత్రి కళ్యాణంలో పాల్గొన్నా... ఎటువంటి అసౌకర్యం కలుగకుండా, నెల రోజులు ముందునుండే అధికారులను సమన్వయం చేయడం కారణంగానే కళ్యాణం విజయవంతం అయిందని మంత్రి మెచ్చుకున్నారు.