ఖమ్మం, (విజయక్రాంతి): రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు గురువారం ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ సందర్భంగా ఆయన పలువురు కేంద్ర మంత్రులను, వివిధ శాఖల ఉన్నతాధికారులను కలిశారు. తొలుత కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ రావును కలిశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు తెలంగాణా లో కొత్తగా విమానాశ్రయాలు ఏర్పాటు చేయడంతో పాటు ఉన్న విమానాశ్రయాలను మరింతగా విస్తరించి అభివృద్ధి చేసి, మ్యాప్ళిక మౌళిక వసతులను పెంచాలని కోరారు.
అనంతరం వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను కలిసి ఇటీవల పామాయిల్ ముడి దిగుమతులపై 5 నుంచి 27.5 శాతం సుంకాన్ని పెంచడాన్ని హర్షం వ్యక్తం చేస్తూ మంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. సుంకం పెంచడం వల్ల ఆయిల్ పాo రైతులకు గిట్టుబాటు ధర పెరుగుతుండడం వల్ల ఆయిల్ పామ్ రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ఆయిల్ ఫామ్ ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తున్న ఖమ్మం జిల్లాలో అశ్వారావుపేట ప్రాంతంలో సేంద్రియ ఉద్యాన పంటల సాగు నేపథ్యంలో సెంటర్ ఫర్ ఎక్స్ లెన్స్ ను ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి ని కోరగా సానుకూలంగా స్పందించారు. ఈ సాయంత్రం కల్లా మరి కొంతమంది కేంద్ర మంత్రులు , ఉన్నతాధికారులను కూడా కలిసి వివిధ అభివృద్ధి పనులపై వారితో చర్చించనున్నారు.