calender_icon.png 28 October, 2024 | 10:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రుణమాఫీ అడిగిన రైతులపై మంత్రి తుమ్మల సీరియస్

28-08-2024 03:27:11 AM

  1. వారి వైపు చేయి చూపిస్తూ అసహనం 
  2. కాన్వాయ్ ముందుకు దూసుకువచ్చి రైతుల నిరసన 

ఖమ్మం, ఆగస్టు 27 (విజయక్రాంతి): ‘ఎందుకలా అరుస్తున్నారు. నేను మాట్లాడుతున్నా కదా. ఓర్చుకోలేరా? క్రమశిక్షణ లేకుండా అరిస్తే ఎలా?’ అంటూ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అంటూ రైతులపై చేయి చూపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఖమ్మం కలెక్టరేట్‌లో రెవెన్యూ, హౌసింగ్ అధికారుల తో సమీక్షా సమావేశం నిర్వహించి, సమీక్ష ముగిసిన తర్వాత మంతిర బయటకు వచ్చా రు. అప్పటికే అక్క డ రుణమాఫీ కోసం రైతులు దీక్ష చేపడుతున్నారు.

మంత్రి కాన్వాయ్‌ని చూసిన రైతులు ఒక్కసారిగా అటువైపు దూసుకెళ్లారు. ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. దీంతో మంత్రి కాన్వాయ్ దిగి రైతులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం పో లీసులు రైతులకు సముదాయించే ప్రయత్న ం చేశారు. మరోవైపు రైతులపై మంత్రి సీ రియస్ కావడాన్ని వామపక్ష, రైతు సంఘాల నేతలు తప్పుపడుతున్నారు. న్యాయం చే యాలని అడుగుతున్న రైతుల వైపు చేయి చూపించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అర్హులందరికీ రుణమాఫీ చేసేంతవరకు పోరా టం ఆగదని, మున్ముందు ఆందోళనలను ఉధృతం చేస్తామని ప్రకటించారు.