రైతుల ప్రయోజనాలే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం
హైదరాబాద్: ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేపడుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. మొక్కజొన్న కొనుగోళ్ల కోసం ఇప్పటికే కేటాయించిన రూ.4 వేల కోట్లకు అదనంగా మరో రూ.1800 కోట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేటాయించారని మంత్రి తెలిపారు. ఈ ఏడాది రబీ మార్కెటింగ్ సీజన్ లో రాష్ట్రం మొక్కజొన్న భారీ దిగుబడుల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. రూ.1100 కోట్లతో జొన్న కొనుగోళ్లుకు సిద్ధంగా ఉన్నామని, సీఎం ఆదేశాల మేరకు పొద్దుతిరుగుడు పంట 25 శాతానికి మించి కొనుగోళ్లు చేయాలన్నారు. రైతుల ప్రయోజనాలే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, జిల్లాల వారిగా జొన్న కొనుగోళ్ల ఏర్పాటు పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు ప్రక్రియ చేపట్టాలని మంత్రి తుమ్మల సూచించారు.






