calender_icon.png 24 February, 2025 | 8:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నూతన వధువరులకు మంత్రి తుమ్మల ఆశీర్వాదం

24-02-2025 12:00:00 AM

ఖమ్మం, ఫిబ్రవరి 23 ( విజయక్రాంతి ): రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు ఆదివారం ఖమ్మం జిల్లాలో స్థానిక నాయకులతో కలిసి పర్యటించి, పలు శుభకార్యాలకు హాజరై నూతన వధువరులను, చిన్నారులను ఆశీర్వదించారు. కూసుమంచి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు బొల్లంపల్లి సుధాకర్ రెడ్డి కుమార్తె నికితా రెడ్డి-రాకేష్ రెడ్డి వివాహ కార్యక్రమానికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరై నూతన వధువరులను దీవించారు.

కార్యక్రమంలో ముఖ్య నాయకులు సాదు రమేష్ రెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు. కాగా   నేలకొండపల్లి వాస్తవ్యులు, మాజీ ఎంపీటీసీ మైస శంకర్ - ధనలక్ష్మి కుమారుడి వివాహ కార్యక్రమం లో కూడా పాల్గొని నూతన వధూవరులు మైసా జగదీష్ - సుమలత నవ వధూవరులను మంత్రి తుమ్మల ఆశీర్వదించారు.

 చిన్నారులకు తుమ్మల దీవెనలు 

ఖమ్మం పట్టణంలోని ఎస్ ఆర్ కన్వెన్షన్ హాల్లో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ  మనవరాలు తన్మాయ్ శ్రీ, హార్విక లక్ష్మి ల నూతన వస్త్ర అలంకరణ కార్యక్రమానికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరై చిన్నారులను ఆశీర్వదించారు.