calender_icon.png 27 December, 2024 | 5:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టేకులపల్లిలో పర్యటించిన మంత్రి పొంగులేటి

02-12-2024 03:50:38 PM

ఇల్లెందు,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గ పరిధిలోని  టేకులపల్లి మండలంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్యలు పలు అభివృద్ధి కార్యక్రమాలకు సోమవారం శంకుస్థాపనలు చేశారు. మండలంలో సింగ్యతండా నుంచి శాంతినగర్ వెళ్లే బీటి రోడ్డు, కుంటల్ల, ఎర్రాయి గూడెం, ఒడ్డుగూడెం, సంపత్ నగర్ గ్రామాల్లో బీటీ రోడ్లు నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించారు. సింగ్యాతండా నుంచి శాంతినగర్ రూ.1.97 లక్షలతో బీటీ రోడ్డు, దాసుతండ నుంచి ఎర్రబోడు రూ.2.40 లక్షలు, ఎర్రయిగూడెం నుంచి చింతలకట్ట వరకు రూ.90 లక్షలు, ఒడ్డుగూడెం నుంచి మోట్లగూడెం వరకు రూ.3.22 కోట్లతో నిర్మించే పనులకు శంకుస్థాపన చేశారు. 

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని, అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు త్వరలో చేపడతామని అన్నారు. ఆరు గ్యారెంటీలలో రైతు భరోసా కూడా సంక్రాంతి పండుగ తర్వాత ప్రతి ఒక్క రైతు ఖాతాలో  రైతు భరోసా డబ్బులను జమ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జీతేశ్ వి పాటిల్, భద్రాచలం ఐటీడీఏపీఓ రాహుల్, ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్, ఐటీడీఏ ఇంజనీరింగ్ అధికారులు, కాంగ్రెస్ నాయకులు కోరం సురేందర్, భూక్య దేవ నాయక్, ఏలూరు కోటేశ్వరరావు, ఇస్లావత్ రెడ్యా నాయక్, ఇతర ముఖ్య నాయకులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.