calender_icon.png 22 November, 2024 | 6:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మత్స్యకారుల సమస్యలను పరిష్కరిస్తానని హామి ఇచ్చిన మంత్రి శ్రీధర్

22-11-2024 12:51:07 PM

జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం డైరెక్టర్ పోతరవేని క్రాంతి

మంథని (విజయక్రాంతి): మంథని నియోజకవర్గంలోని మత్స్యకారుల సమస్యలను పూర్తిగా పరిష్కరిస్తానని మంత్రి శ్రీధర్ బాబు హామి ఇచ్చినట్లు జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం డైరెక్టర్ పోతరవేని క్రాంతి తెలిపారు.  మున్సిపల్ లోని బోయన్ పేట ప్రాంతానికి చెందిన మత్స్యకారుల సమస్యలపై శుక్రవారం హైదరాబాద్ లోని మంత్రి కార్యాలయంలో మంత్రి శ్రీధర్ బాబును కలిసి పారిశ్రామికంగా మత్స్యకారులకు కావలసిన సదుపాయాలతో పాటు చేప పిల్లలు సరైన సమయంలో అందేలాగా లేనియెడల నగదు బదిలీ కార్యక్రమం చేపట్టే విధంగా చేయాలని కోరామని, అత్యధికంగా గోదావరి నది పరివాహక ప్రాంతం ఉన్న మంథని నియోజకవర్గంలో చేపల పెంపకం, చేపల ఆధారిత పరిశ్రమల విషయమై ఆలోచించాలని కోరామని క్రాంతి తెలిపారు.

సానుకూలంగా స్పందించిన మంత్రి తప్పకుండా మంథని  నియోజకవర్గంలో మత్స్య పారిశ్రామిక ప్రాంతంగా తీర్చిదిద్దడానికి తన వంతు సహాయం చేస్తూ, రాష్ట్ర ముఖ్యమంత్రితో చర్చిస్తామని హామీ ఇవ్వడంతో పాటు పార్టీలకు అతీతంగా క్రాంతి చేస్తున్న సేవలను శ్రీధర్ బాబు అభినందించారు. ఇలాగే మత్స్యకారుల సమస్యలను పరిష్కరించే దిశగా ఇంకా బలంగా తయారు కావాలని మంత్రి వారికి సూచించారన్నారు. ఆయన వెంట మత్స్యకారులు  సబ్బని సమ్మయ్య, పోతరవేని అర్జున్, పోలు కనక రాజ్, డిష్ రాజు, బొజ్జ శ్రీను, జడిగల లక్ష్మణ్, తదితరులు ఉన్నారు.