calender_icon.png 15 January, 2025 | 4:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీ-ఫైబర్ ను ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు

08-12-2024 01:40:11 PM

హైదరాబాద్: ఐటీ, పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ప్రజా పాలన విజయోత్సవాలు ప్రభుత్వం నిర్వహిస్తోంది. ప్రజా పాలన విజయోత్సవాలకు ఐటీ శాఖ మంత్రి శ్రీధ ర్ బాబు, టీజీఐఐసీ ఛైర్మన్ నిర్మల హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు కాంపెనీలతో ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది. టీ-ఫైబర్ ను మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. టీ ఫైబర్ ద్వారా సంగారెడ్డి జిల్లా శ్రీరాంపూర్ వాసులతో మంత్రి మాట్లాడారు. టీ ఫైబర్ ఇంటర్నెట్ ద్వారా ఎన్నో సౌకర్యాలు ఉన్నాయని కుటుంబ సభ్యులు వెల్లడించారు. టీ ఫైబర్ ద్వారా మొబైల్, కంప్యూటర్, టీవీ వాడవచ్చని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఈ సేవలను పరిశీలించి మరింత సౌకర్యవంతంగా తీర్చిద్దుతామని మంత్రి పేర్కొన్నారు.

రైతులకు రుణమాఫీతో పాటు, బోనస్ ల కోసం మొబైల్ అప్లికేషన్ ప్రారంభించామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. టీ ఫైబర్ ద్వారా తక్కువ ధరకే ఇంటర్నెట్, మీసేవ మొబైల్ అప్లికేషన్ ను మంత్రి ప్రారంభించారు. మీసేవతో కొత్తగా సేవలను శ్రీధర్ బాబు అందుబాటులోకి తెచ్చారు. దశల వారీగా పెట్టుబడిదారులకు రాయితీలు ఇస్తామన్నారు.