మంథనిలో మంత్రి క్యాంప్ కార్యాలయంలో చెక్కులు పంపిణీ చేసిన పీఏ చంద్రశేఖర్...
మంథని (విజయక్రాంతి): మంథని శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు మంథని నియోజకవర్గంలోని 443 చెక్కుల గాను సీఎంఆర్ఎఫ్ 288 కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ 155 చెక్కులు మంథని మండలం టౌన్ కళ్యాణ లక్ష్మి (53), రామగిరి మండలం కల్యాణ లక్ష్మి (38), ముత్తారం మండలం కల్యాణ లక్ష్మి (64), లబ్ధిదారులకు, మంథని నియోజకవర్గంలోని సీఎంఆర్ఎఫ్ చెక్కులు కాటారం మండలం (20), మహ ముత్తారం మండలం (11), మహదేవ్ పూర్ మండలం (11), మలహార్ రావు మండలం (40), పలిమెల మండలం (1), మంథని మండలం (75), ముత్తారం మండలం (33), రామగిరి మండలం (36), కమాన్పూర్ మండలం (30), పాలకుర్తి మండలం(4), ఇతర మండలాలు (30) సీఎంఆర్ చెక్కులను మంజూరు మంత్రి చేయించారు.
నియోజకవర్గంలోని పలు ఆస్పత్రిలలో అనారోగ్యంతో చికిత్స పొంది సహాయం కొరకు మంత్రి క్యాంప్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్న వారికి మంత్రి శ్రీధర్ బాబు వీరికి ప్రభుత్వం నుండి సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంజూరు చేపించారు. పై చెక్కులను శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు వారి ప్రభుత్వ వ్యక్తిగత సహాయకులు (పీఏ)ఆకుల చంద్రశేఖర్ వారికి మంత్రి క్యాంప్ కార్యాలయంలో గురువారం ఈ చెక్కులు అందజేశారు.